మోకిలలో భూభారతి చట్టంపై రెవెన్యూ అవగాహన సదస్సు.

TEJA NEWS

మోకిలలో భూభారతి చట్టంపై రెవెన్యూ అవగాహన సదస్సు.

శంకర్పల్లి: శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామపంచాయతీ ప్రాంగణంలో భూభారతి చట్టం–2025పై రెవెన్యూ అవగాహన సదస్సు బుధవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సదస్సులో రెవెన్యూశాఖ అధికారులు మాట్లాడుతూ, ధరణి పోర్టల్ వల్ల భూముల రిజిస్ట్రేషన్ మరియు రికార్డు నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారం చూపుతుందని తెలిపారు. కొత్త చట్టం ద్వారా భూముల పట్ల ఉన్న అనుమానాలు తొలగి, భూ హక్కులపై స్పష్టత కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ప్రతి ఒక్కరి ఫిర్యాదును పరిశీలించి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థులు ఈ సదస్సును వినూత్న ప్రస్థానంగా అభివర్ణించారు. భవిష్యత్‌లో ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది రైతులకు ఉపయోగపడే విధంగా జరగాలని ఆకాంక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top