ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్ల పంపిణీ:
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీలోని 13వ వార్డు,14వ వార్డు,15వ వార్డు,22వ వార్డుల నందు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉప్పల వెంకటేష్ సహకారంతో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు మెడికల్ కిట్లని పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, పిఎ సి ఎస్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి,కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బావండ్ల మధు, మాజీ కౌన్సిలర్లు కార్వంగ సైదులు గౌడ్, యడ్మ భోజిరెడ్డి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు దారమోని గణేష్, బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వట్టేపు కిషోర్, శేఖర్ గౌడ్,రాకేష్, ఆనంద్, సాయి,సుల్తాన్ ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
