జగన్ రెడ్డివి అన్నీ అరాచక డ్రామాలే

TEJA NEWS

జగన్ రెడ్డివి అన్నీ అరాచక డ్రామాలే

** ప్రెస్ క్లబ్ లో మున్సిపల్ డిప్యూటీ మేయర్

తిరుపతి: జగన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ ఇప్పుడు ఏడాది కాలంగా అరాచక డ్రామాలు ఆడుతున్నారని తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, తిరుపతి పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడులు ఆరోపించారు. గురువారం వాళ్లు రాష్ట్ర నాయిబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పల్నాడు పర్యటన వైసీపీ పార్టీ ఉనికి కోసమే అని, ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఏమాత్రం కాదని స్పష్టం చేశారు. అక్కడ చనిపోయిన నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ కార్యకర్త వైసిపి పార్టీ 2024లో అధికారంలోకి వస్తుందని దాదాపు 5 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాశాడని… తీరా వైసిపి ఘోరంగా ఓడిపోయిన తర్వాత అతని దగ్గర బెట్టింగ్ కాసిన వ్యక్తులందరూ బెట్టింగ్ డబ్బులు ఇవ్వాలని వచ్చి ఒత్తిడి చేస్తారని డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2024 జూన్ 9వ తేదీ చనిపోయాడని తెలిపారు. అయితే సంవత్సరం తర్వాత ఇప్పుడు జగన్ రెడ్డి నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికని సాకుతో డీజే డాన్సులు వేసుకుంటూ… అనుమతి లేని వందలాది వాహనాలతో రావడమే కాకుండా ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమయ్యాడని మండిపడ్డారు. ఈ సంఘటన బట్టి వైసిపి పార్టీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిందని, ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం జగన్ రెడ్డి శవయాత్రల ఓదార్పు పేరుతో మరో విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు

. ఇలాంటి నాటకాల్లో చంద్రబాబు నాయుడు ఓపికను పరీక్షిస్తే మాత్రం చట్టం అమలుచేసి చూపుతారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని బల ప్రదర్శనలు చేసినా….వైసిపి ఈ రాష్ట్రంలో ఇక 40 సంవత్సరాలయినా అధికారంలోకి రాదని జోష్యం చెప్పారు. ప్రజలు వైసిపి ఐదు సంవత్సరాల పాలనతో విసిగి వేసారి ఆరడుగుల గొయ్యి తీసి వంద అడుగుల లోతులో జగన్ పార్టీని పాతి పెట్టేసారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా తమ కూటమి ప్రభుత్వంలో శరవేగంగా ముందుకు వెళుతున్న సత్యాన్ని చూసి ఓర్వలేని వైసిపి 2029లో అధికారంలోకి వస్తాం అని కలలు కంటోందని ఎద్దేవా చేశారు. పైగా అధికారంలోకి వచ్చిన వెంటనే రపరఫామనీ ఎదురొచ్చిన అందరిని గొంతులు కోసుకుంటూ వెళతామని, అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ వెళ్తామని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ముందే ఫ్లెక్సీలు ప్రదర్శించారు అంటే వైసిపి నాయకులు, కార్యకర్తల మానసిక స్థితి ఏమిటో అర్థం అవుతోందని పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, సొంత చెల్లి, తల్లి టెలిఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటే వీరికి బంధుత్వాలు, బంధాలు ఏమాత్రం లెక్క లేదని అర్థమవుతుందని తెలిపారు. ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు ముక్తకంఠంతో తీర్పు ఇచ్చారని…. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటి చంద్ర, విశ్వనాథం, సుబ్బు యాదవ్, జగ్గా, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top