ఆరోగ్యంద్ర ప్రదేశ్ యే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం

TEJA NEWS

ఆరోగ్యంద్ర ప్రదేశ్ యే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం

ప్రతి ఒక్కరూ యోగా డే లో పాల్గొనాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పిలుపు

21 న హిందూపురంలో జరిగే యోగాంద్ర దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరు

పుట్టపర్తి : ఆరోగ్యంద్రాప్రదేశ్ గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంద్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రతిఒక్కరూ ఆయా ప్రాంతాల్లో నిర్వహించే యోగా కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగాంద్ర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విశాఖ పట్నం లో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు,ఎమ్మెల్యేలు ఎంపీలతో కలసి సుమారు 5లక్షల మంది తో యోగా డే నిర్వహిస్తున్నారని తెలిపారు. యోగా చేయడం వల్ల మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అందుకే రాష్ట్రాంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం చేపట్టారని అందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సత్యసాయి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హిందూపురం లో ఉదయం 6.30 గంటలకు నిర్వహించే యోగా దినోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి గారితోపాటు హాజరవుతున్నట్లు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top