ఆర్.వి.యస్.సి.వి.యస్. ఇంగ్లీషు మీడియం హై స్కూల్ లో ఘనంగా

TEJA NEWS

ఆర్.వి.యస్.సి.వి.యస్. ఇంగ్లీషు మీడియం హై స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం

చిలకలూరిపేట :అంతర్జాతీయ యోగ దినోత్సవంసందర్భంగాస్థానికఆర్.వి.యస్.సి.వి.యస్. ఇంగ్లీషు మీడియం హై స్కూల్ ప్రాగణంలో యోగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట విద్యాసంఘం ప్రెసిడెంట్ తేళ్ళ సుబ్బారావు యోగ దినోత్సవం ప్రాముఖ్యతను మరియు యోగ ఆసనాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి విద్యార్ధులందరికీ చాలా చక్కగా వర్ణించారు. అలాగే సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ శ్రీ మైలవరపు శివానంద కుమార్ యోగ మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఈ యోగ దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం మనందరి అదృష్టం అని, యోగ రోజు మన దిన చర్యలో భాగం కావలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధిని విద్యార్ధులు, ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపాల్ షేక్ గౌషుల్ ఆజామ్ పాల్గొని యోగ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top