యోగాతో ప్రశాంతత
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. అమరావతి లోని, పాత మ్యూజియం ప్రాంగణంలో జరిగిన యోగ వేడుకల్లో టిడిపి ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమం జరిగి యోగాసనాలు అనుసరించారు. విశాఖ వేదికగా జరిగిన యోగ వేడుకలను స్క్రీన్ మీద తిలకించారు. అనంతరం ఈ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రశాంతత అవసరమని, అది యోగాతో సిద్ధిస్తుందన్నారు. యోగ విశిష్టతను ప్రపంచానికి చాటెందుకు.. విశాఖ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం మ్యూజియంలోని పురావస్తు వస్తువులను, విగ్రహాలను పరిశీలించారు
