గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఎమ్మెల్యే జారే

TEJA NEWS

గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం
అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడెం, మద్దికొండ, అచ్యుతాపురం, కొత్తనారంవారిగూడెం, మొద్దులగూడెం, నారంవారిగూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల ప్రహరీ గోడలు, నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, రిటైనింగ్ వాల్ మొదలైన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి
ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే నిధులను సమర్ధవంతంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, పంచాయతీ రాజ్ డీఈ శ్రీధర్, ఏఈ అక్షిత, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు మండల నాయకులు జూపల్లి రమేష్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top