నూతనంగా మార్చరీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

TEJA NEWS

నూతనంగా మార్చరీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెరాయిగూడెం గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణంలో నూతనంగా నిర్మించిన మార్చరీ భవనాన్ని స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అదే ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని ఇంజినీరింగ్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలుశాఖల అధికారులు మండల మాజీ అధ్యక్షులు తుమ్మా రాంబాబు, మండల నాయకులు జూపల్లి రమేష్,మొగళ్లపు చెన్నకేశవరావు, జేష్ఠ సత్యనారాయణ, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top