రేషన్ డీలర్లు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి

TEJA NEWS

రేషన్ డీలర్లు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని మూడు నెలలకు సరిపడా ఒకేసారి ఇస్తున్న తరుణంలో దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించని చందంగా కొంతమంది రేషన్ డీలర్లు సమయపాలన పాటించకుండా ప్రజలను ఇబ్బందిలకు గురి చేస్తున్నారని లబ్ధిదారులను మళ్లీమళ్లీ తిప్పుకుంటున్నారని రేషన్ డీలర్లు సమయపాలన పాటించే విధంగా చూడాలని నాది కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ బిజెపి అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి ఆర్డీవో శ్రీను కు వినతి పత్రం ఇచ్చారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రేషన్ బియ్యం ఇచ్చినప్పుడు లబ్ధిదారులకు రసీదులు ఇవ్వట్లేదని చివరి లబ్ధిదారుడు వరకు రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని దానికోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ప్రతిరేషన్ షాప్ లో బియ్యం అందుబాటులో ఉంచాలని ప్రతి రేషన్ షాపు వద్ద ప్రధానమంత్రి ఫోటో కనపడేలా పెట్టాలని బియ్యం తూకంలో అవకతవకలు జరగకుండా చూడాలని ఈనెల 30వ తేదీ చివరి రోజు కాబట్టి ఆ రోజు పూర్తిగా తెరిచి ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు,
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు నరెడ్ల శేఖర్ రెడ్డి బోడ నరసింహ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండోజు గంగాధర్ రూరల్ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్ సీనియర్ నాయకులు కుడుముల రాంరెడ్డి కృష్ణ బాలరాజ్ గౌడ్ పట్టణ ఉపాధ్యక్షులు అభిగౌడ్ కొల్లూరి శ్రీధర్ పట్టణ ప్రధాన కార్యదర్శి నాప శివ కార్యదర్శి తగుళ్ల వెంకటేష్ యాదవ్ బూత్ అధ్యక్షులు రాఘవేందర్ సాగర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top