రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి: – చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
చేవెళ్ల పట్టణంలోని వ్యవసాయ కార్యాలయం ఆవరణలో చేవెళ్ల, శంకర్ పల్లి, షాబాద్ మరియు మొయినాబాద్ మండలాలకు సంబంధించిన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం రాయితీ పై పరికరాలను పంపిణీ చేసిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. రైతును రాజుగా చూడాలని కోరారు. రైతులందరూ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం రైతులకు ప్రొసీడింగ్స్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
