చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి లక్ష్మి నరసమ్మ కి ముందస్తు చికిత్స కోసం సీఎం సహాయనిధి నుండి 1.50 లక్షల రూపాయల LOC ను మాజీ మంత్రి , నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు.
అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ప్రభుత్వం అని, ఎంతోమందికి ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ఆదుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు , షేక్ కరీముల్లా , బండారుపల్లి సత్యం , జవ్వాజి మదన్ , పఠాన్ సమద్ , కామినేని సాయిబాబా , తుపాకుల అప్పారావు , మద్దుమాల రవి , మురకొండ మల్లిబాబు తదితరుల పాల్గొన్నారు…
