అనంతపురం :
10 మంది కిడ్నాప్ ముఠా అరెస్టు… బొలేరో, టీవీలర్ మరియు కత్తి స్వాధీనం
- కంబదూరు మండలం కురాకులపల్లి మహిళా టీచర్ కిడ్నాప్ కేసు ఛేదింపు
- కుటుంబ సభ్యులే కిడ్నాపర్లు… ఆస్తి రాయించుకోవడానికి కిడ్నాప్ చేసిన వైనం
- జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాలతో కిడ్నాప్ ముఠాను అరెస్టు చేసిన కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పోలీసులు
- కిడ్నాప్ కేసు ఛేదింపు వివరాలను తన కార్యాలయంలో వెల్లడించిన కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు
** అరెస్టయిన నిందితుల వివరాలు :
1) మనిగే ఆనంద్ @ఆనందకుమార్, వయస్సు 61 సం., తగ్గుపర్తి గ్రామం, బెళుగుప్ప మండలం.
2) మనిగే శామలమ్మ, వయస్సు 55 సం.,తగ్గుపర్తి గ్రామం, బెళుగుప్ప మండలం.
3) మనిగే విశాఖ @ ఇషాఖ, వయస్సు 22 సం., తగ్గుపర్తి గ్రామం, బెళుగుప్ప మండలం.
4) మీనుగ ఎల్లప్ప, వయస్సు 35 సం.,తగ్గుపర్తి గ్రామం, బెళుగుప్ప మండలం.
5) మీనుగ మహాలక్ష్మి, వయస్సు 30 సం.,తగ్గుపర్తి గ్రామం, బెళుగుప్ప మండలం.
6) పొదుగు అంకాలప్ప, వయస్సు 35 సం., కొర్రకోడు గ్రామం, కుడేరు మండలం.
7) H మహేష్, వయస్సు 29 సం., కలేకుర్తి గ్రామం, కనేకల్ మండలం.
8) M వన్నూరుస్వామి, వయస్సు 35 సం., SC కాలనీ, కళేకుర్తి గ్రామం, కనేకల్ మండలం.
9) కెంచప్ప గారి రమేష్ వయస్సు 38 సం., కళేకుర్తి గ్రామం, కనేకల్ మండలం.
10) తుమ్మిగనూరు మహేంద్ర వయస్సు 34 సం., కళేకుర్తి గ్రామం, కనేకల్ మండలం.
** పరారీలో ఉన్న నిందితుడు :
11) H బాబు, SC కాలనీ, కళేకుర్తి గ్రామం, కనేకల్ మండలం. ( అరెస్టు కావాల్సి ఉంది )
** మహిళా టీచర్ కిడ్నాప్ …కేసు నమోదు :
కంబదూరు మండలం కురాకులపల్లి ఎం.పి.పి పాఠశాలలో టీచర్ గా మారుతమ్మ పని చేస్తోంది. ఈనెల 12 వ తేదీన స్కూలు ముగిశాక తన భర్త ఎగ్గిడి ఎర్రిస్వామితో కలిసి బైకుపై తగ్గుపర్తి గ్రామానికి బయలుదేరారు. అప్పటికే పథకం ప్రకారం బొలేరో, టూవీలర్లపై సిద్ధంగా ఉన్న మారుతమ్మ తండ్రి ఆనంద్ మరియు 9 మంది బొలెరో మరియు మోటార్ సైకిల్ లతో వారిని అడ్డగించి మార్గమద్యలో కిడ్నాప్ చేసుకెళ్లారు. ఈమేరకు మారుతమ్మ భర్త ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు కంబదూరు పోలీస్ స్టేషన్ లో కేసు Cr. No. 49/2025 U/s 126(2), 127 (2), 118 (1), 140 (1), 308 (5), 137 r/w 3(5) BNS Act. నమోదు చేశారు.
