టాన్సిల్స్ ఆపరేషన్ సమయంలో 12 ఏళ్ల బాలుడి మృతి

TEJA NEWS

టాన్సిల్స్ ఆపరేషన్ సమయంలో 12 ఏళ్ల బాలుడి మృతి

చెరుకూరి హాస్పిటల్‌ నిర్లక్ష్యంపై ఆరోపణలు

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో టాన్సిల్స్ ఆపరేషన్ సమయంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది. వైద్య నిర్లక్ష్యం కారణంగా తమ బిడ్డ చనిపోయాడని బంధువులు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కె. సంతోష్ కుమార్ (12) కు ముక్కులో కండరాలు పెరగడం (టాన్సిల్స్) సమస్య ఉంది దీంతో ఈ రోజు ఉదయం 9:30 గంటలకు సత్తెనపల్లి రోడ్‌లోని ఇఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సంతోష్‌ను నరసరావుపేటలోని చెరుకూరి హాస్పిటల్‌కు తీసుకువెళ్లి ఆపరేషన్ (టాన్సిలెక్టమీ) చేపట్టారని స్థానికులు తెలిపారు .

ఆపరేషన్ కోసం మత్తుమందు (అనస్థీషియా) ఇచ్చిన వెంటనే బాలుడికి స్ట్రోక్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడని తెలిసింది.

అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, అనుభవం లేకపోవడం వల్ల ఈ విషాదం సంభవించిందని మృతుడి తండ్రి రాంబాబు, బంధువులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page

Scroll to Top