ఇళ్ల పట్టాల కోసం మండుటెండలో దీక్షలు 13వ రోజు…

TEJA NEWS

ఇళ్ల పట్టాల కోసం మండుటెండలో దీక్షలు 13వ రోజు…

మంద కొమరమ్మ కాలనీ వాసుల డిమాండ్… అధికారులు స్పందిస్తారా…?

పెద్దపల్లి గోదావరిఖనిలో ఇళ్ల పట్టాల కోసం మంద కొమరమ్మ కాలనీ వాసులు చేపట్టిన దీక్షలు మండుటెండలో 13వ. రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా తమకు కూడా పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

దీక్షలో కూర్చున్న నాయకులు మాట్లాడుతూ, అత్యంత పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్న మాదిగలలో చాలామందికి స్వంత ఇళ్లు లేకపోవడంతో అద్దె భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ స్పందించి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.

దీక్ష కార్యక్రమంలో మంద రవికుమార్, రొంటాల రాధా, అంబాల అర్చన, రాసపల్లి రవికుమార్, మైస రవీందర్, కాసిపేట రాజయ్య, మడిపల్లి దశరథం, కాంపల్లి శ్రీనివాస్, రామంచ సరోజన, శనిగరపు పౌల్, కనకం సుగుణ, రెంటాల సుజాత, పుల్లూరు కొమురయ్య తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top