వార్డు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా 14వ వార్డుస్వతంత్ర అభ్యర్థి చీర్ల స్రవంతి

TEJA NEWS

వార్డు అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా 14వ వార్డుస్వతంత్ర అభ్యర్థి చీర్ల స్రవంతి

వనపర్తి : ప్రజలు అవకాశం ఇస్తేవార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని 14 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి చీర స్రవంతి రమేష్ అన్నారు వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఓటర్లతో కలిసి ఇండిపెండెంట్ కుర్చీ గుర్తుకు ఓటు వేసి కౌన్సిల్కు పంపాలని అభ్యర్థించారు గత 30 ఏళ్లుగా ఇదే వార్డులో నివాసం ఉంటున్నామని వార్డు సమస్యలపై పూర్తి అవగాహన తమకు ఉందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందించేందుకు కృషి చేస్తామని అలాగే అంగన్వాడి సెంటర్లు మహిళా సమాఖ్య సెంటర్లు కమ్యూనిటీ హాల్ పార్కులు సీసీ కెమెరాలు ఏర్పాటు సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ సీనియర్ సిటిజెన్ల కోసం మినీ లైబ్రరీ ఇతరత్రా సమస్యలు ఏమున్న తీర్చేందుకు వార్డు ప్రజలకు అందుబాటులోనే ఉంటామని హామీ నిచ్చారు చీరల స్రవంతి కుటుంబ సభ్యులైన హీరో హోండా గోపాల్ మాట్లాడుతూ గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాయకులు గా పనిచేశానని పార్టీ బీఫామ్ ఇవ్వనప్పటికీ కూడా వేరే ఏ పార్టీ నీ దరి చేరలేదని ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు గానే ఉంటామని వార్డు ప్రజలు ఆదరించి గెలిపించి కౌన్సిల్కు పంపిస్తే అధికార పార్టీ నాయకుల అండతో వార్డు అభివృద్ధికి మరింత కృషి చేస్తామని చీర్ల హీరో హోండాగోపాల్ తెలిపారు ప్రచారంలో వార్డు ప్రజలు ఓటర్లు స్రవంతి కుటుంబ సభ్యులు బంధువులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top