సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడటం జరిగింది.
పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
- బిడ్డా నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని విచారణలకు పిలిచినా నిన్ను విడిచి పెట్టేది లేదు రేవంత్ రెడ్డి.
- ఎన్నికల ముందు అటెన్షన్ డైవర్షన్ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నావు.
- మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. మేం తప్పు చేయలేదు.
- రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చినా నేను సిద్దిపేట నుంచి వచ్చి హాజరవుతున్నా.
- దైర్యంగా వెళ్తున్నాం అడిగిన వాటికి బాజాప్తా సమాధానం చెబుతాం
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ సుప్రీం కోర్టు చెంపచెల్లు మనేలా సమాధానం చెప్పింది.
- నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా నిన్ను వదిలి పెట్టం. నీ కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటం.
- కేసీఆర్ నాయకత్వంలో రాటు దేలిన కార్యకర్తలం. ఉద్యమకారులం
- ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా వదిలి పెట్టం. ప్రజల కోసం, రాష్ట్రం కోసం మా పోరాటం జరుపుతూనే ఉంటాం.
- ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసే దాకా వెంటపడుతూనే ఉంటం.
- మున్సిపల్ ఎన్నికల వేళ డ్రామాలు. రెండేళ్లలో నువ్వు ఈ కేసులో చేసింది ఏముంది.
- ఇంకా ఎన్ని రోజులు ఈ సీరియల్ నడుపుతావు
- ఇప్పటికే కాళేశ్వరం పేరుతో శ్వేతపత్రాలు అన్నవు, విచారణ అన్నవు, కమిషన్ అన్నవు.
- చిల్లర రాజకీయాలు బంద్ పెట్టు.
- ప్రజలకు కావాల్సింది రైతు బందు, పింఛన్, ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్ మెంట్, తులం బంగారం.
- ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి, నామీద కేసులు పెడితే, అటెన్షన్ డైవర్ట్ చేస్తే తప్పించుకోలేవు.
- ఇంకా గట్టిగా నిలదీస్తం. మున్సిపల్ ఎన్నికల ఎజెండా నీ ఆరు గ్యారెంటీలు, నీ 420 హామీలు, రెండు లక్షల ఉద్యోగాలు
- మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నాలు సక్సెస్ కావు. నీ కేసులకు బిఆర్ఎస్ బయపడదు.
- వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నీకు ప్రజలకు దిమ్మదిరిగే విధంగా జవాబు చెబుతారు చూస్కో రేవంత్ రెడ్డి.
