పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

TEJA NEWS

పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

పీఎంయూవై కింద మంజూరుకు కేంద్రం ఆమోదం

సూర్యపేట జిల్లా : ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎం యూవై) కింద 25 లక్షల అదనపు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిని పేద మహిళలకు అందించనున్నట్టు చమురు మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకూ ఇచ్చిన ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 10.58 కోట్లకు చేరిందని పేర్కొంది. అదనపు కనెక్షన్ల కోసం రూ.676 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇందులో రూ.512.5 కోట్లను ఒక్కొక్క కనెక్షన్ కు చెల్లించే రూ.2050 డిపాజిట్ రూపంలో, మరో రూ.160 కోట్లు ఒక్కో సిలిండర్ పై ఇచ్చే రూ.300 సబ్సిడీ రూపంలో వ్యయం చేస్తారు. పీఎంయూవై కింద లబ్ధిదారులకు డిపాజిట్ లేకుండా ఉచిత కనెక్షన్, ప్రెషర్ రెగ్యులేటర్, సురక్షా హోస్, గ్యాస్ గృహ వినియోగదారు కార్డు అందిస్తారు.

You cannot copy content of this page

Scroll to Top