ఎంబిబిఎస్(MBBS) విద్యార్థికి 25000 ఆర్టిక సహకారము

TEJA NEWS

ఎంబిబిఎస్(MBBS) విద్యార్థికి 25000 ఆర్టిక సహకారము
డాక్టర్ వృతి చాలా గొప్పది……. ప్రజా వైద్యులు డాక్టర్ మురళీధర్

వనపర్తి :
యువత పట్టుదలతో కష్టపడి చదవడంతో పాటు గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్ష ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని ప్రజా వైద్యుడు డాక్టర్ మురళీధర్ అన్నారు.
వనపర్తి మండలం రాజపేట గ్రామానికి చెందిన లక్ష్మయ్య & ఈశ్వరమ్మ ల కొడుకు మోహన్ కుమార్ నీట్ పరీక్ష లో 383 మార్కులతో 6000 స్టేట్ ర్యాంక్ తో జయశంకర్ భూపాలపల్లి లో ఎంబిబిఎస్ సీట్ విద్యార్థి హాస్టల్ ఫీజు రూ. 25000 ఆర్తిక సహాయం చేసి మురళీధర్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
మోహన్ కుమార్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో,కళాశాలలో చదివి ఎంబిబిఎస్ సీటు సాధించడo చాల గర్వకారణమన్నారు.
పేద కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి చదివి ఎంబిబిఎస్ లో సీట్ సాధించినందుకు చాల సంతోషకరమని కొనియాడారు.
తను ఒక మంచి డాక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని వనపర్తి జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ ప్రేమ్‌నాథ్ రెడ్డి,రాజారాం ప్రకాష్, వేణుగోపాల్,శంకరన్ స్పూర్తి వేదిక కన్వీనర్ శశిభూషణ్,రాఘవ రెడ్డి, రాజు, గందంనాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top