విప్లవాత్మక ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి

TEJA NEWS

విప్లవాత్మక ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పించిన మండలనేని చరణ్ తేజ

చిలకలూరిపేట:విప్లవాత్మక ప్రజా నాయకుడు వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మండలనేని చరణ్ తేజ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన ధీరుడు వంగవీటి మోహనరంగా గారని కొనియాడారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి, అన్యాయానికి ఎదిరించిన ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.వంగవీటి మోహనరంగా త్యాగాలు, ప్రజాసేవ, పోరాట స్పూర్తి ఎప్పటికీ మరువలేనివని తెలిపారు. ఆయన చూపిన ఆశయాలు, సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని మండలనేని చరణ్ తేజ అన్నారు.

You cannot copy content of this page

Scroll to Top