99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా,39వ. డివిజన్ లో సందర్శించిన మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, స్థానిక 39వ. డివిజన్ కు స్థానిక మేయర్ మహంకాళి స్వామి హాజరు కావడం జరిగింది.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మరియు స్థానిక కార్పొరేటర్ తిప్పారపు మానస ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. మేయర్ స్థానిక కూరగాయల మార్కెట్ ను సందర్శించి, సమస్యలను తెలుసుకున్నారు. స్థానికంగా త్రాగునీరు, రోడ్లు డ్రైనేజీ సమస్యలను స్థానిక కార్పొరేటర్ తిప్పారపు మానస, తిప్పారపు శ్రీనివాస్ మేయర్ దృష్టికి తీసుకోవడం జరిగింది.
వెంటనే మేయర్ స్పందించి ఆర్ఓ ప్లాంట్, టాయిలెట్స్, మార్కెట్ ఆనుకొని ఉన్న రోడ్లు నిర్మాణం చేపిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, ఫజల్, నాయకులు ఆకుల అరుణ్, ఇండ్ల ఓదెలు, సమ్మెట స్వప్న, మిట్ట తిరుపతి, గజ బీమ్ కార్ బాబు , నర్సోధ్,పెట్టేం రాజు, పెరిక రవి, రాసూరు నరసయ్య, వేల్పుల లింగం, వాజిద్, అంజద్ తోపాటు అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, పాల్గొన్నారు.
