ప్రజావాణికి 53 ఫిర్యాదులు

TEJA NEWS

ప్రజావాణికి 53 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు సూచించారు.

కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (53) ఫిర్యాదులు అందాయి.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవిస్తూ అర్జీలను జిల్లా కలెక్టర్ కు సమర్పించారు.వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ,సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ,నర్సింగ రావు,ఆర్డీఓ శ్రీనివాస రావు,వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

జారీ చేయు వారు :-డిపిఆర్ ఓ/జోగులాంబ గద్వాల్ జిల్లా.

You cannot copy content of this page

Scroll to Top