కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 55 మంది

TEJA NEWS

కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 55 మంది లబ్ధిదారులకు 55,06,380/- యాబై ఐదు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ *

కూకట్పల్లి మండలం పరిధిలోని వివేకానంద నగర్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ , కూకట్పల్లి (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 55 మంది లబ్ధిదారులకు 55,06,380/- యాబై ఐదు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై రూపాయల ఆర్థిక సహాయాన్ని వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తో కలిసి లబ్ధిదారులకు చెక్కుల రూపేణా అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 55 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, నాయి నేనీ చంద్రకాంత్ రావు, మారేళ్ల శ్రీనివాస్, శివరాజు గౌడ్, మోజేశ్, చిరుమర్తి రాజు, షౌకత్ అలీ మున్నా, బసంత్ రాజు, గోపాల్, లింగం, సత్యనారాయణ, శ్రీనివాస్, మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top