
వనపర్తి జిల్లా లోక్ అదాలత్ లో 5625 కేసులు పరిష్కారం…………. జిల్లా న్యాయమూర్తి ఎం.ఆర్. సునీత
వనపర్తి
లోక్ అదాలత్ అంటే ప్రజల న్యాయ పీఠము అని కేసు రాజీ పడినట్లయితే కక్షిదారులు ఇరువురు గెలుపొందినట్లే అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎమ్.ఆర్ సునీత అన్నారు.
వనపర్తి జిల్లా కోర్ట్ లొ నిర్వహించిన లోకాదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీపడ దగ్గ కేసులు
రాజిచేసుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం అని అన్నారు. ప్రతి మూడు నెలలకి ఒకసారి నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లొ రాజీ పడదగ్గ కేసులు అనగా అన్నదమ్ముల మధ్య తాగదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వెహికిల్ ప్రమాదము కేసులు, కుటుంబ తాగాదా కేసులు, భార్యభర్తల కేసులు, సైబర్ క్రైమ్ కేసులు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కేసులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగకుండా రెండు వర్గాలు కూర్చుని మాట్లాడుకుని కేసులను పరిష్కరించుకునే అవకాశం జాతీయ లోక్ అదాలత్ కల్పించిందని సూచించారు. ఈరోజు నిర్వహించిన లోక్అదాలత్ లో జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులు 5625 కేసులు పరిష్కారమయ్యాయని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వి రజని, సీనియర్ సివిల్ జడ్జ్ జి కలర్చన, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ టి కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్. అశ్విని, బార్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, బార్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటరమణ న్యాయవాదులు, బ్యాంకు మేనేజర్, కోర్టు సిబ్బంది మరియు లోకదాలత్ సిబ్బంది పాల్గొన్నారు.