నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా 63 హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు….
నైపుణ్యతను పెంచుకోని పోలీసులకు దీటుగా విధి నిర్వహణ చేస్తున్నారు మీ సేవలు అభినందనీయం……
హోంగార్డ్స్ సంక్షేమానికి అన్నివేళలా అండగా ఉంటూ నా వంతు కృషి చేస్తా…….
జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS .
ఉదయం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయం నందు 63 వ హోంగార్డ్స్ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ IPS పాల్గొని హోంగార్డు నుండి వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ “పోలీస్ శాఖలో నిస్వార్ధ సేవయే మా దృడ నిశ్చయము అనే ఉదేశ్యముతో నిష్కామ సేవ చేస్తున్నా హోంగార్డలందరికి నా అభినందనలు.సమాజసేవలో, శాంతి భద్రతలు పరిరక్షించుటలో పోలిసులతో కలిసి పని చెయ్యడం గొప్పదని,పోలీసు సిబ్బందితో పోలిస్తే హోంగార్డులకు సౌకర్యాలు తక్కువ ఉన్నా కూడా కొన్ని సంధర్భాలలో వారి కంటే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఈ విషయంలో నంద్యాల జిల్లా పోలీస్ శాఖ తరపున హోంగార్డులకు అభినందనలు తెలిపారు.
బ్రిటిష్ పాలన నుండి దేశం అప్పుడే విముక్తి పొంది ఉన్న తరుణములో ప్రజలకు అందుబాటులో ఉంటూ రక్షణ కల్పిస్తూ సమాజములో చలరేగే అలజడులను శాంతియుతంగా అదుపు చేసేందుకు ఇతర సేవలు అందించేందుకు అనువుగా అన్ని రాష్ట్ర ప్రభుత్యాలు స్వచ్చంద సేవ సంస్థలు ఏర్పాటు చేసుకోవాలని 1959 మార్చి నెలలో కేంద్ర కేబినేట్ మరియు హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు చేయటము జరిగింది.
1962 చైనా యుద్ధానంతరము ఫీల్డ్ మార్షల్ శ్రీ జనరల్ కరియప్ప సలహా మేరకు స్వచ్చంద సేవ బృందాలను హోంగార్డ్స్ గా గుర్తించాలని దేశ వ్యాప్తంగా అదే పేరుతో పని చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అలా 1963 లో హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించబడింది.
నంద్యాల జిల్లాలో మొత్తం 397 మంది హోంగార్డ్స్ చట్టం & శాంతి భద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, క్లైమ్ కంట్రోల్, డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, వివిధ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, దేవస్థాన భద్రత, తదితర సాంకేతిక కేటగిరీల్లో విధులు నిర్వహిస్తున్నారు.
క్రింది సంస్థల్లో 97 మంది హోం గార్డ్స్ డిప్యూటేషన్లో మొత్తం సేవలందిస్తున్నారు:
శ్రీశైలం దేవస్థానం – 40 మంది.
అహోబిలం దేవస్థానం – 10 మంది.
మహానంది దేవస్థానం – 03 మంది.
అగ్నిమాపక శాఖ – 16 మంది.
ఉపజైళ్లు – 05 మంది.
ఆర్టీఓ – 10 మంది.
సెంట్రల్ వేర్ హౌస్ 03 మంది.
ప్రసార్ భారతి 03 మంది.
అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించటం, మత సామరస్యాని కాపాడటం, ఆర్థిక, సామజిక, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం, ఇవ్వని హోంగార్డ్స్ విధులే. అలాగే మన నంద్యాల పరిధిలో జరుగుతున వి.వి.ఐ.పి., కార్తీకమాసం,ఎలక్షన్ బందోబస్తూ, ఇతర ప్రభుత్వ కార్యక్రమ బందోబస్తూ విధులు నిర్వహించుచున్నారు అందుకే ప్రభుత్వము వారు వీరి సేవలను గుర్తించి వారికీ డ్యూటీ అలవెన్సు కూడా పెంచడము జరిగిందని తెలియజేశారు.
అనంతరం ఈ సంవత్సర కాలంలో పలు విభాగాలలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందజేయడంతో పాటు వారి పిల్లలు చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను మెరిట్ స్కాలర్షిప్ లను అందజేస్తు జిల్లా ఎస్పీ అభినందించారు.
పోలీస్ శాఖ చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలలో పోలీసులతో సమానంగా తమకు సమున్నత స్థానం కల్పిస్తున్న జిల్లా ఎస్పీ కి హోంగార్డ్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం. జావళి IPS , ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ , ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ , AR డీఎస్పీ శ్రీనివాసరావు ,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బాబు,మంజునాథ్, సురేష్ బాబు RSIలు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
