చిలకలూరిపేట నియోజకవర్గంలో ఘనంగా మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి

TEJA NEWS

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఘనంగా మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు…

చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి విడుదల రజిని ఆదేశానుసారం పట్టణ అధ్యక్షులు షేక్ ధరియావలి మరియు పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ కందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా వైయస్సార్ 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి,పాలాభిషేకం చేసి ఆయనకి నివాళులర్పించారు.
ముందుగా మాజీ మంత్రి విడదల రజని నివాసంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అనంతరం పల్నాడు జిల్లా యూత్ ప్రెసిడెంట్ మరియు యువ నాయకుడు కందుల శ్రీకాంత్ రక్తదానం చేయడంతో పలువురు యువకులు కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top