తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ నూతన కార్యాలయం నియోజకవర్గ జర్నలిస్టులకు ఒక కేంద్రబిందువుగా, సమాచార మార్పిడికి, సమస్యల పరిష్కారానికి మరియు కార్యకలాపాల సక్రమ నిర్వహణకు ఎంతో ఉపయోగపడనుంధీ – బి.ఆర్.ఎస్.పార్టీ విప్,ఎమ్మెల్యే కె.ఫై.వివేకానంద..
125 – గాజులరామారం డివిజన్ పరిధిలోని శ్రీవెన్ ఎనక్లేవ్ కాలనీలో పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ వస్తున్న తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ (TJU), నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది, ఈ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి.వివేకానంద ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించనున్నారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఈ కార్యాలయం జర్నలిస్టుల మద్దతుకు, యూనియన్ కార్యకలాపాలకు, సమావేశాలకు, సమావేశ స్థలంగా ఎంతో ఉపయోగపడుతుందని , TJU ఆశయాలు, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది కీలకమైన పాత్ర పోషిస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో TJU రాష్ట్ర అధ్యక్షులు కప్పరా ప్రసాద్ రావు, ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ఎడిటర్ వి. సత్యం గౌడ్,IFWJ జాతీయ ఉపాదేక్షుకు పెద్దాపురం నర్సింహా, IFWJ జాతీయ కార్యదర్శి భరత్ కుమార్ శర్మ , , కార్యదర్శి బింగి స్వామి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జి.వి. రామకృష్ణ, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పల్లపు శ్రీనివాస్, MN చారి, కిషోర్ చారి, సూర్య, రాము, కోటేశ్వర్ రావు, మహేష్, పర్వేజ్, రమేష్, వెంకటేష్,రజని, నాగమణి , మరియు స్థానిక నాయకులు పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రామి రెడ్డి, తెలంగాణ సాయి తదితరులు పాల్గొన్నారు..
