- మామ్స్ ప్రవేట్ పాఠశాలలో అక్రమ పుస్తకాల అమ్మకాన్ని అడ్డుకున్న……. టీజీవీపీ
పుస్తకాలను సీజ్ చేసి యాజమాన్యాన్ని హెచ్చరించిన ఎంఈఓ
వనపర్తి : జిల్లా కేంద్రంలోని నంది హిల్స్ కాలనీలోని మామ్స్ విజన్ పాఠశాలలో అక్రమంగా పుస్తకాలను విక్రయిస్తున్నారని తల్లిదండ్రుల నుంచి సమాచారం రావడంతో టీజీవిపి జిల్లా కార్యదర్శి కేదార్నాథ్ తమ బృందంతో పాఠశాలను సందర్శించి రూడి అయిన తర్వాత అక్కడి నుంచే స్థానిక మండల విద్యాధికారి మద్దిలేటి కి సమాచారం ఇవ్వడంతో ఆయన పాఠశాలను సందర్శించి పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేశారు. పాఠశాలలో పుస్తకాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ పాఠశాల యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు టిజివీపి నాయకులు, విజయ్, కార్తీక్, మనీ, శివ, దేవి పాల్గొన్నారు
