టీటీడీ ఉద్యోగులకూ రెఫరల్ దర్శనాలు ఇవ్వాలి

TEJA NEWS

టీటీడీ ఉద్యోగులకూ రెఫరల్ దర్శనాలు ఇవ్వాలి

** అదనపు ఈఓకు జాయింట్ యాక్షన్ కమిటీ వినతి

తిరుమల: శ్రీవారి సన్నిధిలో, అనేక విభాగాల్లో అనుక్షణం భక్తులకు నిస్వార్త సేవలు అందిస్తున్న టీటీడీ ఉద్యోగులకు కూడా వివిధ రెఫరెల్ దర్శనాలు కల్పించాలని టీటీడీ జాయింట్ యాక్షన్ కమిటీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరికి విన్నవించింది. ఈమేరకు జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థపాక అధ్యక్షుడు ఎ. ఆంజనేయులు, కార్యదర్శి గోల్కొండ వెంకటేశం నేతృత్వంలో కమిటీ సభ్యులు వినతి చేశారు. బుధవారం తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి అధ్యక్షతన సీవీ అండ్ ఎస్వో మురళి కృష్ణ, టెంపుల్ డెప్యూటీ ఈఓ, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ, వెల్ఫేర్ డెప్యూటీ ఈఓ , వీజీవో ల సమక్షంలో టీటీడీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పై చర్చించారు. ఈ చర్చలో భాగంగా ఉద్యోగులకు రెఫెరల్ లెటర్ పై నెలకు 10 రూ.300 దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి మొదలైన పర్వదినాలలో ఉద్యోగుల రెఫెరల్ లెటర్ పై 10 మందికి దర్శనం టికెట్ల పై స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని, ప్రతిరోజూ ఉద్యోగుల రెఫెరల్ లెటర్ పై ఇస్తున్న 200 రూమ్ లను 400 రూమ్ లకు పెంచాలని, ఉద్యోగులకు సంబంధించిన దర్శనం, రూమ్ లు, లడ్డు, వడ ప్రసాదాలను ఒకే చోట మంజూరు చేసే విధంగా తిరుమలలో ఎంప్లాయిస్ కౌంటర్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆంజనేయులు,, వెంకటేశం తెలిపారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించిన అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) తరపున ధన్యవాదములు తెలియచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ తో పాటు ఎస్సీ – ఎస్టీ ఎంప్లాయిస్ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top