బోనాలు వేడుకలకు ఆహ్వానం
సికింద్రాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఆషాడ మాస బోనాలు వేడుకల్లో పాల్గొనాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ మంత్రి తీగుల్ల పద్మారావు గౌడ్ ను ప్రభుత్వ దేవాదాయ శాఖ అధికారులు ఆహ్వానించారు. ఈ మేరకు దేవాదాయ శాఖకు చెందిన అధికారి రాజేష్ తో పాటు అధికారుల బృందం పద్మారావు గౌడ్ ను మోండా మార్కెట్ లోని ఆయన నివాసంలో కలుసుకొని గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, బాల్కంపేట్ బోనాలు వేడుకల ఆహ్వాన పత్రికలను పద్మారావు గౌడ్ కు అందించారు.
