రేవేంద్రపాడు విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆర్థికసాయం
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన విద్యార్థిని
మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ మెజార్టీతో రూ.91,413 చెక్కు అందజేత
కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థిని
ఉండవల్లిః పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మండల టాపర్ గా నిలిచిన విద్యార్థినికి మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రేవేంద్రపాడు ఎంపీటీసీ కొప్పుల మధుబాబు రూ.91,413 ఆర్థికసాయం అందించారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జడ్పీ హైస్కూల్ లో చదివిన గంపా ఉమామహేశ్వరి అనే విద్యార్థిని మొన్నటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 575 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు. దీంతో మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనిబరిచిన వారికి మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేష్ సాధించిన మెజార్టీతో నగదు బహుమతి అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రూ.91,413 చెక్కును సదరు విద్యార్థినికి అందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన తనకు అండగా నిలవడం పట్ల మంత్రి లోకేష్, టీడీపీ నేత మధుబాబుకు విద్యార్థిని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
