ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానం లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమం నకు
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని, తంగేడు మైదానం వద్ద ర్యాలీని జెండా
ఊపి మంత్రి ప్రారంభించారు. ర్యాలీ డి ఎల్ ఆర్
గార్డెన్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్,
ఎస్ పి షబరిష్, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, అదనపు ఎస్ పి సదానందం, గ్రంధాలయ చైర్మన్ బానోత్ రవి చందర్,
సంబంధిత అధికారులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
