సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి, పాకాల, రామచంద్రాపురం, చంద్రగిరి, చిన్నగొట్టుగల్లు, యర్రావారిపాలెం మండలాలకు సంబంధించిన పలువురికి ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 39 లక్షల 02 వేల 291రూపాయల
చెక్కలను బాధిత కుటుంబ సభ్యులకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పంపిణీ చేశారు. ఇందుకోసం
తిరుపతి రూరల్ మండలం తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి, పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం
మండలాలకు సంబందించిన పలువురికి సిఎంఆర్ఎఫ్ సహయ నిధి ద్వారా అనారోగ్య, ఇతర సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయించారు. తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనారోగ్య, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నానిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భాధిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
