కేరళలో మార్మోగిన జై తెలుగు తల్లి నినాదాలు

TEJA NEWS

కేరళలో మార్మోగిన జై తెలుగు తల్లి నినాదాలు

ఉత్సాహంగా తెలుగు భాషాభిమానుల జైత్రయాత్ర

జైత్రయాత్రకు నేతృత్వం వహించిన మండలి బుద్ధప్రసాద్

కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నగరంలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాషాభిమానుల జైత్రయాత్ర ఉత్సాహంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ ఈ జైత్రయాత్రకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. కొచ్చిన్ నగరంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం శ్రీరాంపూర్, టీటాఘర్, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, హోస్పేట, బళ్లారి, మహారాష్ట్ర రాష్ట్రం ముంబై, కేరళ రాష్ట్రం కొచ్చిన్, ఒడిస్సా రాష్ట్రం పారలఖేముండి, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి నుంచి తెలుగు భాషా అభిమాన సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ఈ జైత్రయాత్రలో పాల్గొన్నారు. మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో తెలుగు తల్లి చిత్రపటంతో ముందుకు సాగిన దేశవ్యాప్త తెలుగు భాషా అభిమాన సంఘాల ప్రతినిధులు జై తెలుగు తల్లి.. జై మాతృ భాష… నినాదాలు మారుమోగించారు. రాష్ట్రేతర తెలుగు భాషా సంఘాల ప్రతినిధులు మా తెలుగు తల్లి మల్లె పూదండ… దేశ భాషలందు తెలుగు లెస్స అనే నినాదాలతో కూడిన కండువాలు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

You cannot copy content of this page

Scroll to Top