ఆయిల్ ఫామ్ పంటల వల్ల అధిక లాభాలు …
చేవెళ్ల మునిసిపాలిటీ పరిధిలోని దేవుని ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఫామ్ ఆయిల్ మెగా ప్లాంటేషన్ తోటను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి “తుమ్మల నాగేశ్వర రావు” , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు మరియు చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
◆ ముందుగా ఎమ్మెల్యే మంత్రి కి శాలువా వేసి స్వాగతం పలకడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ ద్వారా నేడు రైతులకు అనేక రకాల లాభాలు చేకూరుతున్నాయని, రైతులు వైవిధ్యమైనటువంటి ఆయిల్ ఫామ్ పంటను ఎక్కువ సంఖ్యలో వేయాలని కోరారు.
◆ అనంతరం ఆయిల్ ఫామ్ మొక్కలను నాటీ, రైతులకు యూరియాను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
