నిరుపేదల సొంతింటి కల నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.

TEJA NEWS

నిరుపేదల సొంతింటి కల నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…… కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి

వనపర్తి: నిజమైన అర్హులకు సొంతింటి కల సహకారం అవుతుందని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
జిల్లాలోని కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డులో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ నాయకులు వార్డులోని ఫోటో స్టూడియో ముజీబ్ లబ్ధిదారునితో కలిసి భూమి పూజ చేసిన అనంతరం మాట్లాడుతూ
నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటామని లబ్ధిదారులకు భరోసా కల్పిస్తున్నామనితెలిపారు .
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని పది సంవత్సరాలు కాలయాపన చేసిందని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం చారిత్మాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేదలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు ఇచ్చిన మాట ప్రకారం 14 నెలలలో ఇల్లు మంజూరు చేసి సొంతింటి కలను సాకారం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పేద వారి ఇంటి కల నెరవేర్చాలని సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు.

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను పారదర్శకంగా చేపట్టి ఎంపిక చేయడం జరిగింది. ఇండ్లు రానివారు నిరశపడద్దని ఎవరైనా ఉంటే వారికి తప్పకుండా ఎమ్మెల్యే అవకాశం కలిపిస్తారని ఎవరి ఇబ్బంది పడొద్దు అని అన్నారు. రెండో విడత జూలై లోనేఉంటుంది కాబట్టి అర్హులైన అందరికీ ఇండ్లు వస్తాయని వారు తెలిపారు.
లబ్ధిదారులు ఇంటి నిర్మాణం త్వరగా పూర్తిచేస్తే వెంటనే బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వార్డు ఇంచార్జి శివశంకర్, మండల మాజీ కో ఆప్షన్ మెంబర్ ఎం ఎ లతీఫ్, మాజీ వార్డ్ మెంబర్స్ సలీం ఖాన్, మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి పి మోహన్ రెడ్డి, పి శంకర్ యాదవ్, ఎండి కైసర్, గఫర్, ఎండి మునీర్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top