సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి pawankalyan ఆర్థిక సాయం
- నటి దీనస్థితికి చలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
- పవన్ కళ్యాణ్ తరపున రూ.2 లక్షలు సాయం అందించిన శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు పాకీజాకు అందజేశారు.
పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
