సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి pawankalyan ఆర్థిక సాయం

TEJA NEWS

సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి pawankalyan ఆర్థిక సాయం

  • నటి దీనస్థితికి చలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
  • పవన్ కళ్యాణ్ తరపున రూ.2 లక్షలు సాయం అందించిన శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ

తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా)కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆప్త హస్తం అందించారు. ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరి మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్ , పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు పాకీజాకు అందజేశారు.
పవన్ కళ్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top