స్విమ్స్ లో జాతీయ వైద్యుల దినోత్సవం

TEJA NEWS

స్విమ్స్ లో జాతీయ వైద్యుల దినోత్సవం

తిరుపతి: తిరుపతిలో టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, స్విమ్స్ డీన్ డా.అల్లాడి మోహన్, రిజిస్ట్రార్ డా. అపర్ణ ఆర్ బిట్లా, నెఫ్రాలజీ సీనియర్ డా. శివకుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ వనజాక్షమ్మ, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఉషాకళావత్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా.నాగరాజు సంయుక్తంగా జ్యోతిని వెలిగించి డా.బిధాన్ చంద్ర రాయ్ ఛిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్విమ్స్ సంచాలకులు డా. ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ…. ముందుగా అందరికి జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ…. వైద్య వృత్తి ఎంతో మహోన్నతమైనదని, ఈ వృత్తిని సామాజిక బాధ్యతగా భావించి విలువలతో కూడిన సేవలను రోగులకు అందించాలని కోరారు. ఈ క్రమంలో తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని, కటుంబ సభ్యుల సంక్షేమాన్ని నిర్లక్యం చేయరాదని తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం డా.బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్ధం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం భారతదేశం వైద్యులు, ఇతర వైద్య నిపుణుల అద్భుతమైన కృషిని గుర్తించడం కోసం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారని ఈ సంవత్సరం ధీమ్ బిహైండ్ ది మాస్క్, హు హీల్స్ ది హీలెర్స్ అని తెలిపారు.


స్విమ్స్ డీన్ డా.అల్లాడి మోహన్ మాట్లాడుతూ… మన స్విమ్స్ నందు జాతీయ వైద్యల దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకమని, ప్రతి ఓక్కరు యం.బి.బి.యస్ విద్యార్ధిని విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత, కొంతకాలం వైద్య విద్యాభోధకులు గా చేయాలని పిలుపునిచ్చారు.
నెఫ్రాలజి సీనియర్ డా.శివకుమార్ మాట్లాడుతూ… పశ్చిమ బెంగాల్ బిధాన్ చంద్ర రాయ్ ఒక ప్రముఖ వైద్యుడని, సి.యం.గా వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా బిధాన్ పుట్టిన రోజైన జులై 1ని భారత ప్రభుత్వం జాతీయ వైద్యుల దినోత్సవంగా 1991లో ప్రకటించింది. అప్పటి నుండి మన దేశంలో ప్రతి ఏడాది జులై 1న నేషనల్ డాక్టర్స్ డే గా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డా. కళావత్, డా. శ్రీహరి రావు, డా. వెంకటరమణ, డాక్టర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎర్రమ రెడ్డి, సిబ్బంది, స్విమ్స్, యస్.పి.యం.సి. డబ్ల్యు, యం.బి.బి.యస్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గోన్నారు.

You cannot copy content of this page

Scroll to Top