అంబులెన్స్ లోనే కాన్పు, తల్లి బిడ్డ క్షేమం

TEJA NEWS

అంబులెన్స్ లోనే కాన్పు, తల్లి బిడ్డ క్షేమం

వనపర్తి : పానగల్ మండల పరిధిలోని గోప్లాపూర్ గ్రామానికి చెందిన మహేశ్వరమ్మ అంబులెన్స్ లో కాన్పు జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్న సంఘటన తెల్లవారుజామున చోటుచేసుకుంది. అంబులెన్స్ వైద్యులు, ప్రసవం మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గోపులాపురం గ్రామానికి చెందిన మహేశ్వరమ్మకు తెల్లవారుజామున తీవ్రమైన మొదటి కాన్పు ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు. మహేశ్వరమ్మను కాన్పు కోసం 108 అంబులెన్సు వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దావాజ్ పల్లి స్టేజి సమీపంలో పసవ నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్ లోని అత్యవసర వైద్య సిబ్బంది బుద్వేష్, భాస్కర్ చాకచౌక్యంగా వ్యవహరించి మహేశ్వరమ్మకు అంబులెన్స్ లోనే కాన్పు నిర్వహించారు. మహేశ్వరమ్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డను వనపర్తి లోని ఎంసిఎచ్ హాస్పిటల్ నందు చేర్పించారు. సుఖ ప్రసవం నిర్వహించిన అంబులెన్స్ సిబ్బందికి మహేశ్వరమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top