దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్ – శుభాభినందనలు

TEJA NEWS

దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్ – శుభాభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
……………………………………………
సాక్షిత : దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) 5 ఏళ్లుగా ప్రజాప్రయోజనాలకే కట్టుబడి, ఉత్తమ పాలనతో నిరంతరంగా సేవలందించడంతో, ISO 9001:2015 మరియు HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ను అందుకోవడం గర్వకారణమని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పేర్కొన్నారు.

1960లో స్థాపితమైన ఈ బ్యాంక్, గత 5 సంవత్సరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. 2019లో రూ.24.85 కోట్ల డిపాజిట్లు ఉండగా, 2024 నాటికి ఇవి రూ.56.82 కోట్లకు పెరిగాయి. అప్పుల జారీ రూ.21.22 కోట్ల నుంచి రూ.32.26 కోట్లకు, ఆస్తుల విలువ రూ.2.9 కోట్ల నుంచి రూ.9.97 కోట్లకు, లాభాలు రూ.53 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు పెరిగినట్లు తెలిపారు.

ఈ బ్యాంక్‌కు చెందిన రెండు భవనాలు మరియు ఐదు గోదాముల ద్వారా వార్షికంగా రూ.1.53 కోట్ల అద్దె ఆదాయం లభిస్తోంది. ఈ భవనాలు నాబార్డ్ నుండి రుణంగా పొందిన నిధులతో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం బ్యాంక్ నెలకు రూ.1.19 లక్షల EMI చెల్లిస్తోంది.

ప్యాక్స్ నిర్వహణ వ్యవస్థ రైతులకు మరియు ఖాతాదారులకు ప్రయోజనకరంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ బ్యాంక్ అభివృద్ధి ఇతర ప్యాక్స్‌కు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా PACS అధ్యక్షుడు నరేంద్ర రాజు , వైస్ చైర్మన్ రవీందర్ రెడ్డి , డైరెక్టర్లు సిహెచ్ మధుసూదన్ , పి. మల్లేష్ , జి. కృష్ణ యాదవ్ , డి. నరేందర్ , బి. మధుసూదన్ , ఎం. మదన్ రావు , ఏ. సత్యనారాయణ , సీఈవో శ్రీ కృష్ణ , మరియు ఇతర మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top