పేట పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికులను బెంబేలెత్తిస్తున్న వడ్డీ వ్యాపారాలు…
చిలకలూరిపేట పురపాలక సంఘంలో పారిశుద్ధ్య కార్మికులు వడ్డీ వ్యాపారుల ఆగడాలకు బలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి, వడ్డీలు కట్టలేక తమ ఉద్యోగాలను సైతం వదిలేసి వెళ్ళిపోతున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు వడ్డీ వ్యాపారుల చేతిలో
ఈ వడ్డీ వ్యాపారుల దౌర్జన్యం ఏ స్థాయిలో ఉందంటే, కార్మికుల బ్యాంక్ పాస్ పుస్తకాలను, ఏటీఎం కార్డులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారట. దీంతో కార్మికులు తమ జీతాలను నేరుగా అందుకునే అవకాశం లేకుండా పోతోంది. ఇది వారి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని హరించివేసి, వడ్డీ వ్యాపారులపై పూర్తిగా ఆధారపడేలా చేస్తోంది.
గతంలోనూ ఇలాంటి పరిస్థితులే…
విముక్తి కలిగించిన నామ కనకారావు
గతంలో కూడా చిలకలూరిపేట పురపాలక సంఘంలో ఇదే మాదిరిగా వడ్డీ వ్యాపారుల బెడద ఉండేది. అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు చొరవ తీసుకుని పారిశుద్ధ్య కార్మికులకు ఈ వడ్డీ వ్యాపారుల బారి నుండి విముక్తి కలిగించారు.
వడ్డీ వ్యాపారుల అకృత్యాలకు కొన్ని
ఉదాహరణలు
- అధిక వడ్డీలు: ఒక కార్మికుడు రూ. 10,000 వడ్డీకి తీసుకుంటే, వడ్డీ వ్యాపారులు అమానుషమైన వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నారు.
- మరణానంతరం బెదిరింపులు: ఒక కార్మికుడు ప్రమాదకరంగానో, ఆరోగ్య కారణాలతోనో చనిపోతే, ఆ కుటుంబం తీసుకున్న అప్పు వేల రూపాయల్లో ఉన్నప్పటికీ, వారి మరణం తర్వాత రెండు నెలలకే లక్షల్లో అప్పుగా తీసుకున్నారని బెదిరిస్తున్నారట.
- ఇళ్ళు లాక్కోవడం: వడ్డీ కట్టలేని వారి ఇళ్ళను సైతం లాక్కొని బయటికి పంపించిన దాఖలాలు చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయని తెలుస్తోంది.
ప్రస్తుత అధికారులకు పారిశుద్ధ్య కార్మికుల విజ్ఞప్తి
ప్రస్తుతం అధికారంలో ఉన్న అధికారులు తమకు ఈ వడ్డీ వ్యాపారుల బారి నుండి విముక్తి కలిగించాలని పారిశుద్ధ్య కార్మికులు వేడుకుంటున్నారు. వారి దీనస్థితిని అర్థం చేసుకుని, గతంలో నామ కనకారావు లాగే చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే పారిశుద్ధ్య కార్మికుల జీవితాలు మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంది.
వడ్డీ వ్యాపారుల పై కాల మని కేసులు..!
గతంలో ఇదే మాదిరిగా వడ్డీ వ్యాపారులు
పారిశుద్ధ కార్మికులను వేధింపులకు గురిచేస్తున్న క్రమంలో ఆనాటి మున్సిపల్ అధికారులు ,పోలీసులు పారిశుద్ధ్య కార్మికుల అధిక వడ్డీలు వసూలు చేసేవారి ఆగడాల పట్ల కఠినంగా వ్యవహరించి కాలమని కేసులు సైతం నమోదు చేసి వారి ఆగడాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం తో కనుమరుగైన వడ్డీ వ్యాపారులు, రూపం మార్చుకొని అధికారుల కళ్లుగప్పి యధేచ్చగా వడ్డీ వ్యాపారులు విజృంభణ చేస్తున్నారు,వీరి వడ్డీ వ్యాపారానికి లైసెన్సులు ఉండవు,అనుమతులు అంతకన్నా ఉండవు. సమాజంలో మాత్రం వీరు పెద్ద మనుషులుగా చలామణి అవుతారు వారే సచ్చిసిలూరుగా ఇతరులపై బురద జల్లుతూ ఉంటారు .వీరి అవసరానికి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తో వ్యవహారాలు నేర్పుతారు,కావున అధికారులు ఇటువంటి వారి పై గతంలో పెట్టిన కాలమని కేసులు అంతకన్నా నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టీ పారిశుద్ధ కార్మికుల జీవితాలను కాపాడాలని పారిశుద్ధ కార్మికుల కుటుంబాలు వేడుకుంటున్నాయి
