వెంగమాంబ సన్నిధిలో కాకొల్లు వారి మహా అన్నదాన కార్యక్రమం

TEJA NEWS

వెంగమాంబ సన్నిధిలో కాకొల్లు వారి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు కాకర్ల, డాక్టర్ ఉగ్ర,మాజీ ఏఎంసి దారపనేని, భాష్యం రామకృష్ణ

కనిగిరి ; నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలసి ఉన్న జగన్మాత శ్రీ శ్రీ శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాల అనంతరం అమ్మవారి 16 రోజుల పండుగ దేవస్థానం నిర్వహకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధువన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత కాకొల్లు నాగేశ్వరరావు దంపతులు, కొండపనాయుడు దంపతులు, శ్రీమతి రాములమ్మల సారధ్యంలో దేవస్థానంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి 16 రోజులు పండుగలో ఉదయగిరి శాసనసభ్యులు, కాకర్ల సురేష్, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి, మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి,కనిగిరి మాజీ ఏఎంసి చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత వీరేంద్రనాథ్ చౌదరి, ఒమేగా విద్యాసంస్థల అధినేత బైరెడ్డి జయరామిరెడ్డి, లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ అధినేత వడ్లమూడి నాగేంద్ర, ఉదయగిరి టిడిపి నాయకులు చండ్ర ఉమామహేశ్వరరావు, మధుసూదన్ రావు, కామేపల్లి వెంకటరత్నం, పామూరు మండల టిడిపి నాయకులు గుర్రం వెంకటేశ్వర రావు, కొప్పల్లి సురేష్, కోనేరు చిన్న, శ్రీనివాసులు రెడ్డి, దారపనేని రాజేంద్రప్రసాద్, మిరియం సుబ్బరాయుడు, మట్లే రాహుల్ యాదవ్, యరశింగు రాయుడు కాకర్ల సాయి, మిల్లు మహేష్, కొట్టే సాయి, కొట్టే బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం అనంతరం కాకొల్లు నాగేశ్వరరావు, దారపనేని చంద్రశేఖర్ , ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, డాక్టర్, భాష్యం రామకృష్ణ లకు దృశ్యాలతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.

You cannot copy content of this page

Scroll to Top