రెండవ రోజుకు చేరిన “సుపరిపాలనకు తొలి అడుగు”

TEJA NEWS

రెండవ రోజుకు చేరిన “సుపరిపాలనకు తొలి అడుగు”

తిరుపతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న “సుపరిపాలనకు తొలి అడుగు” కార్యక్రమం రెండవ రోజు తిరుపతి రూరల్ మండలాల్లో, చంద్రగిరి నియిజకవర్గంలో జోరుగా కొనసాగింది. ఈమేరకు తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి మహిళలు, యువత హారతులు పట్టి తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. పంచాయతీలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బ్రోచర్లను తిరుపతి రూరల్ మండలంలో పంచుతూ ప్రచారం చేశారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను పంచుతూ ఎమ్మెల్యే నాని ప్రజలను ఆత్మీయంగా పలకరించారు.

2024 ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీల సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటిని నెరవేస్తున్నామని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. అయితే గతంలో పని చేసిన వైసీపీ ప్రభుత్వం…… ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యత్యాసాన్ని గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటూ ప్రజల నుంచి వినతులు స్వేకరించారు. 2019 – 2024 జూన్ మధ్య రాత్రిపూట బయటకు పోవాలంటే భయపడే వాళ్ళం…. ఇప్పుడు గుండెల మీద చేయి వేసుకొని దర్జాగా వెళ్తున్నాం అని చాలామంది మహిళలు, బాలికలు, ప్రజలు ఎమ్మెల్యే తో చెప్పారు. పంచాయతీలోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని ప్రజలకు స్పష్టం చేశారు.
చంద్రగిరి నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top