మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు మన్యం వీరుడు అల్లూరి:
మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు
ఘనంగా మున్సిపల్ కార్యాలయంలో
అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం…
చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా మున్సిపల్ అధికారులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం జయంతిని పురస్కరించుకొని కమిషనర్ పీ. శ్రీ హరిబాబు మాట్లాడుతూ మన్యం వీరుడుగా భావి భారత పౌరులకు స్వేచ్ఛ స్వాతంత్రలు అందించాలన్న గొప్ప ఆశయంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి ఎదురుగా రంపా తిరుగుబాటుకు నేతత్వం వహించిన మహా యోధుడు,
మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని ఆయన సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మకంతో, దాని కోసం బ్రిటిష్ పాలకులను ఎదురొడ్డి పోరాడిన విప్లవ యోధుడునీ.ఆ పోరాటంలో ప్రాణాలను సైతం దేశం కోసం.మాతృభూమి కోసం అర్పించిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు
అని కొనియాడారు.
అటువంటి మహనీయల త్యాగపలలే నేటి మన స్వాతంత్రం, అటువంటి మహనీయల
స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకొని మహనీయుల ఆదర్శలను పాటించాలని
భావితరాలకు మహనీయుల చరిత్ర మార్గదర్శకంగా నిలిచే విధంగా దేశ ప్రతిష్ట ఇనుముడింప చేసే విధంగా. భావి భారత పౌరులు నిలుస్తారని ఆశిస్తూ అల్లూరి సీతారామరాజు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ. అబ్దుల్ రహీం. రెవెన్యూ ఆఫీసర్ పి. సుబ్బారావు. రెవిన్యూ ఇన్స్పెక్టర్ గిరిబాబు. మేనేజర్. మొహిద్దిన్. సానిటరీ ఇన్స్పెక్టర్ చేరెడ్డి రమణారావు. టౌన్ ప్లానింగ్, మెప్మా, ఇంజనీరింగ్ . తదితర మున్సిపల్ అధికారులు పాల్గొని అల్లూరి సీతారామరాజు జయంతి నీ పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించారు
