ఈ నెల 08న జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ …
సభ ప్రాంగణం పేరు జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి గా ప్రకటించిన… ఎమ్మెల్యే డా మురళీ నాయక్
మహబూబాబాద్ నియోజకవర్గం: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనకు ఈ నెల 08న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , మంత్రిలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సీతక్క , తుమ్మల నాగేశ్వరరావు , కొండ సురేఖ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి లతో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను,హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ …
అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని ఈ నెల 08న జరగబోయే బహిరంగ సభ విజయవంతం చేయలని ఎమ్మెల్యే డా మురళీ నాయక్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ మాట్లాడుతూ… కేసముద్రం పట్టణాన్ని రెండవ అతిపెద్ద పట్టణంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ వేం సరేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు.
వేం నరేందర్ రెడ్డి కృషితో 133/11, రెండు 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు, 50 పడకల ఆసుపత్రి, పట్టణంలో రెండు రోడ్ల విస్తరణ, ఆదర్శ నగర్, ఎర్రగడ్డ కాలనీ బ్రహ్మం తండా కాలనీ బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని ఆ పనులకు ఈనెల 8న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అలర్ట్ గా ఉండండి, మానుకోట నియోజకవర్గంలో 90 శాతానికి పైగా ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా సన్నద్ధం కావాలని ఎమ్మెల్యే డా.మురళి నాయక్ పిలుపునిచ్చారు.
ఈ సభను విజయవంతం చేయాలని రాబోయే స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలన్నారు.
ఈ సభకు నియోజకవర్గ పరిధి నుంచి 15,20వేల ఏ మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని జిల్లా, మండల, పట్టణ, గ్రామ నాయకులకు ఎమ్మెల్యే సూచించారు.
08న జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రాంగణంలో జరిగే సభను విజయవంతం చేయండి… ఎమ్మెల్యే
డా భూక్యా మురళీ నాయక్
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి,రాష్ట్ర సంవిధాన్ కమిటీ సభ్యులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి ,డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు,ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, మాజీ పీసీసీ సభ్యులు దాస్రు నాయక్ ,కూరెల్లి సతీష్, బానోతు చిన్న వెంకన్న, ఘనపూర్ అంజయ్య, డైరెక్టర్లు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు
