మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించి లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం

TEJA NEWS

మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించి లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి : అధికారులను ఆదేశించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వద్ద మౌలిక వసతుల అభివృద్ధిపై బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హౌసింగ్ కార్పొరేషన్ మరియు మున్సిపల్ శాఖతోపాటు వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. మౌలిక వసతుల కల్పనలో భాగంగా నియోజకవర్గంలోని అన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల వద్ద….

మంజీరా నీటి సౌకర్యం, సివరాజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, లిఫ్ట్ ల నిర్వహణతో పాటు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని అన్నారు.

కరెంట్ మీటర్లను జిహెచ్ఎంసి పేరు మీద కాకుండా లబ్ధిదారుల పేరుకు మార్చి బిల్లును ఇవ్వాలి.

పారిశుద్ధ నిర్వాహణలో భాగంగా చెత్త సేకరణను చేపట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచాలి.

ఎమర్జెన్సీ సమయంలో అందరికీ ఉపయోగపడే విధంగా ఆరోగ్య కేంద్రంతో పాటు మహిళ, శిశు, గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడే అంగన్వాడి సెంటర్లను ఏర్పాటు చేయాలి.

దుండిగల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి.

ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమీషనర్లు సాబేర్ అలీ, వెంకటేష్ నాయక్, హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ రవీందర్, నిజాంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు బాలాజీ నాయక్, జక్కుల కృష్ణ యాదవ్, జక్కుల శ్రీనివాస్, సునీల్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top