విద్యార్థులు ఏఐ, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: బిఆర్ఎస్ విప్,ఎమ్మెల్యే కేపీ వివేకానంద్….
చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో రోబోటిక్,ఏఐ ల్యాబ్ ప్రారంభం.
126 – జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి భగత్ సింగ్ మార్గ్ లో గల చైతన్య విద్యానికేతన్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన రోబోటిక్ ల్యాబ్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏ.ఐ.)తరగతి గదులను బిఆర్ఎస్ విప్,కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….నేటి విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకొని ఎదగాలని విద్యావిధానంలో వస్తున్న మార్పులక నుగుణంగా రోబోటిక్ విద్య ఎంతో అవసరమన్నారు. విద్యా వ్యవస్థలో రోజురోజుకు పెరుగుతున్న మార్పులకు అనుగుణంగా సాధారణ విద్యతోపాటు, సాంకేతిక విద్య ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముందుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చైతన్య పాఠశాలలో రోబోటిక్,ఏఐ ల్యాబ్ ఏర్పాటు చేయడం పట్ల పాఠశాల యాజమాన్యానికి అయన అభినందనలు తెలిపారు.రోబోటిక్ ద్వారా సులభతరంగా పాఠ్యాంశాలు విద్యార్థులు అర్ధం చేసుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా విద్యాధికారిణి ఐ.విజయకుమారి,
కార్పొరేటర్ జగన్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు, చైతన్య విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ శివరాత్రి యాదగిరి, ట్రస్మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు జె.నాగరాజు, కోశాధికారి పరుశురాం గౌడ్, వివిధ ట్రస్మా కే. శ్రీనివాస్ చారి, నర్సిరెడ్డి, శ్రీకాంత్, సుశీల్ కుమార్, కాశిరెడ్డి, సుబ్రహ్మణ్యం, షోయబ్, అంజన్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, ధన్ సాగర్ తో పాటు వివిధ పాటల కరస్పాండెంట్ లు, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
