ప్లాట్లు కొనేముందు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి.

TEJA NEWS

ప్లాట్లు కొనేముందు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి.. ప్రకటన ద్వారా మోసపోవద్దు

  కన్జ్యూమర్ రైట్ ప్రొడక్షన్ ఫోరం అధ్యక్షుడు మురికిపూడి ప్రసాద్ 

లేఅవుట్ వేసిన వెంచర్లు అని లేదా గేటెడ్ కమ్యూనిటీ అనీ వచ్చే ప్రకటనల్లో నిజా నిజాలు తెలుసుకొని కొనుగోలు చేయాలని ప్రసాద్ అన్నారు. సినిమా యాక్టర్లు, టీవీ ఆర్టిస్టులు, లేదా ఇతర రంగాల్లోని ప్రముఖులు ఆ ప్రకటనల్లో చెప్పారని ప్రజలు నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. ఇటీవల ఒక లేఅవుట్ ప్రకటనలో సినీ నటుడు మహేష్ బాబు ఒక వెంచర్ గురించి ప్రకటనలో పాల్గొని కొనుగోలు చేయమని చెప్పగా. అది విని లేదా చూసి సినీ నటుడు మహేష్ బాబు పై నమ్మకంతో వినియోగదారులు ఆ ప్లాట్లు కొన్నారు. కానీ నిజంగా అక్కడ లే అవుట్ కూడా లేదు. ఈ మేరకు వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కోర్టు నోటీసులు మహేష్ బాబు కు పంపించింది.
కాబట్టి ప్రకటనలు నమ్మి కొనవద్దు క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనుగోలు చేయాలని వినియోగదారుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు మురికిపూడి ప్రసాద్ వినియోగదాన్ని కోరారు.

You cannot copy content of this page

Scroll to Top