వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్
తిరుపతి: స్వర్ణాంధ్ర విజన్-2047 లో భాగంగా తిరుపతి జిల్లా యాక్షన్ ప్లాన్ యూనిట్ పై, పి-4 విధానం పై తిరుపతి కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తుడా చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డీతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా అధికారులు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత అండ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ తోనే స్వర్ణఆంధ్ర, విజన్ 2047 సాధ్యమని మంత్రి, ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత పి-4 తో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో ప్రతి అధికారి సహకరించాలని ఎమ్మెల్యేలు సూచించారు.
చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో జరిగిన, జరగబోయే అభివృద్ధినీ సమావేశంలో ఎమ్మెల్యే లు వివరించారు.
