ములుగు లో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి సీతక్క కామెంట్స్ :
- కేటీఆర్ నాతో పెట్టుకుంటే సర్వనాశనం అవుతావు.. నువ్వు మనిషివే అయితే నియోజకవర్గంలో ఏం జరిగిందో నిజాలు తెలసుకొని మాట్లాడు. ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా..?
- ములుగులో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన సాగుతోంది.. ఎలాంటి ఇబ్బందులూ, నిర్బంధాలు ఇక్కడ లేవు..
- కేటీఆర్ దొర అహంకారం తగ్గించుకో.. నీకు కుల, ధన బలం ఉండొచ్చు. నాకు నియోజకవర్గ ప్రజల బలేముంది.
- ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న అభివ`ద్ధిని చూసి బీఆర్ఎస్ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, సీతక్కపై ఉన్న అభిమానం దెబ్బతీసి అభివృద్ధికి ఆటంక పరచాలని చూస్తున్నారు.
- బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, నెరవేర్చిన హామీలు, ఇచ్చిన ఇండ్లు ఎన్నో లెక్క చూసుకొని రా.. సవాల్ విసుతున్నా..
- కేటీఆర్ మిడుతల దండుతో ములుగుపై పడ్డారు. ఓడిపోయిన నాయకులు ములుగు వచ్చి డ్రామాలు చేస్తున్నారు. కనీసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించని వారు రోడ్లపై డ్రామాలు చేస్తారా? పోలీసులు శాంతియుత ధర్నాకు అనుమతిస్తే కన్వాయ్ ని అడ్డుకోవాలని కుట్ర చేశారు.
- కేటీఆర్ నువ్వు నిజంగా మనిషివే అయితే, నీ మనస్సుతో ఆలోచిస్తే, అబద్దాల పునాదులపై నీ పార్టీ పుట్టక పోతే ములుగు నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలుసుకో ముందు.. జూలై 6 వరకు మీ బీఆర్ఎస్ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎన్ని, మీ పాలనలో మా కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎన్ని చెప్పు. సవాల్ చేస్తున్నా.. మా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి హింసించారు.
- దుబాయ్ వేదికగా మీ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నావ్.. ట్విట్టర్ ద్వార అబద్దాలు పెట్టడం మానెయ్.. నిజాలు మాట్లాడు.
- ములుగు నియోజకవర్గంలో సీడ్ తో నష్టపోయిన 950మందికి కంపెనీల ప్రతినిధులతో నిధులు ఇప్పించేందుకు మంత్రి తుమ్మల, తాను వెళ్తుంటే అడ్డుకోవాలని చూస్తారా..
- పదేళ్లలో మీరు ఎందరికి ఇండ్లు ఇచ్చారు.. రాష్ట్రంలో మీ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారని ఎంతో మంది చనిపోయారు. బుట్టాయిగూడెం, చల్వాయిలో చనిపోయిన వారు ఎందుకు చనిపోయారో ముందు కారణాలు తెలుసుకోండి.. మ`తులను పరామర్శించని మీరు, మీ నాయకులు రోడ్లమీదికి వచ్చి డ్రామాలు చేస్తారా?
- పోలీసు డిపార్ట్మెంట్ లో 90శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా బెదిరిస్తారా?
- సిరిసిల్లలో ఇసుక లారీలతో తొక్కించి చంపిది ఎవరు..? మీ పాలనలో అడ్వకేట్లను చంపింది ఎవరు.? ప్రజలను పొట్టన పెట్టుకుంది ఎవరు.. ఉద్యమ కాలంలో కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట దొరకని వారు డ్రామాలు చేస్తారా? 1200ల మంది త్యాగాల పునాదుల మీద పదవులు అనుభవించి అందలమెక్కారు. అధికారం కోల్పోయినాక చనిపోయిన వారిని ఆసరాగా చేసుకుంటున్నారు.
- ముఖ్యంమత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నవ్. తెలంగాణ పేరుతో త్యాగాల మీద పదవులు పొందిన వారు ప్రజలకు ఏం చేసినవ్.. ప్రజలను ఆత్మహ్యతలకు ప్రోత్సహిస్తారా? దుర్మార్గపు రాజకీయాలు చేస్తూ రెచ్చగొడుతున్నారు. రాష్ర్ట ప్రజలు గమనిస్తున్నారు.. మీ పాలనలో బీఆర్ఎస్ నాయకులు వేదిస్తే చనిపోయిన వారు ఎందరో.
- మేము ఎవరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపలేదు.
- ఆదివాసీ గొంతులను నొక్కాలని చూస్తున్నారు. 70ఏళ్ల చరిత్రలో పంచాయతీరాజ్ శాఖకు ఒక కోయ ఆడబిడ్డ మంత్రిగా ఉంటే అక్కసు వెళ్లగక్కుతున్నారు. నాకు ఒక్క అవకాశం వస్తే ఓర్చుకోలేవా కేటీఆర్
- నియోజకవర్గంలో నాపై పోటీ చేసిన ప్రతిపక్ష నాయకురాలిని సర్పంచ్ ను చేసింది నేను. పదవుల కోసం ఇతర పార్టీ వైపు పోయిన వారు కూడా మాట్లాడుతున్నారు.
- నాపై కేటీఆర్ కు ఎందుకు ఇంత కక్ష.. నియోజకవర్గంలో దందాలు ఉండొద్దని పాలన చేస్తున్నాం. ఎర్రమట్టి క్వారీలు, ఇసుక దందాలతో కోట్లు గడించింది మీరు. ప్రస్తుతం నియోజకవర్గంలో 4మాత్రమే క్వారీలు నడుస్తున్నాయి.. పిస్తోలు తో రియల్ వ్యాపారులు దందాలుచేస్తున్నారు..
- ములుగుది ఉద్యమాల చరిత్ర. సమ్మక్క సారలమ్మ, అడవులు, ప్రత్యేక హెరిటేజ్, ఘనమైన చరిత్ర కలిగి ఉంది.
- ఎన్నికల కోసమే డ్రామాలు.. ఓట్ల డ్రామాలు మాత్రమే.. తప్పులు ఉంటే నిజాయితీ గా మాట్లాడండి.. టూరిజం, రోడ్లు, డిపో, బస్టాండ్ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. ప్రజా హితం కోసం చేస్తున్నం. ప్రజా రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం..
- ముఖ్యమంత్రి మనవడికి రామప్ప గుర్తుగా రుద్రదేవ్ అని పేరు పెట్టారు.
- నియోజకవర్గంలో 60వేల అప్లికేషన్లు వస్తే 20వేలు నిజమైన లబ్ధిదారులుగా గుర్తించారు అధికారులు. వచ్చినవి 3500లు, మరో 1500 ఐటీవీఏ ద్వారా వచ్చాయి. మంత్రి పొంగులేటి మరో వెయ్యి. మొత్తం 6వేల ఇండ్లు ఇస్తున్నాం. అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.. ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ మాయలో పడొద్దు..
- కావాలని పోలీసు రాజ్యం అంటున్నారు.. టార్గెట్ చేసి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నరు..
- కేటీఆర్ నువ్వు మనిషివే అయితే వాస్తవాలు, నిజాలు మాట్లాడు.. గొడవలకు కాదు.. సమస్య పరిష్కారానికి కృషి చేయండి.. చిల్లర రాజకీయాలు మాట్లాడొద్దు. నీ చెల్లినే నీమీద మన్ను పోస్తోంది..
- నాతో పెట్టుకుంటే సర్వనాశనం అవుతారు. నేను ఒక్క దాన్నే, కుల, దన బలం లేదు.. ములుగు ప్రజలే నా బలం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీల ఆశీస్సులు నాకు ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కి సహకరించండి..
మంత్రి సీతక్క అన్నారు
ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు
పైడాకుల అశోక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
